దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితో కరోనాపై విజయం సాధిస్తామన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఏర్పడిందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కరోనా నివారణకు మోదీ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచమంతా దేశం వైపు చూస్తుందన్నారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన నీరుపేదలకు, వలస కూలీలకు భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో... హైదర్గూడ సంజయ్ కాలనీలో నిత్యావసర సరుకులను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు, మాజీ మంత్రి దేవయ్యతో కలిసి పంపిణీ చేశారు.
భాజపా ఎస్సీ మోర్చా నిత్యావసరాల పంపిణీ - జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు
హైదరాబాద్ హైదర్గూడ సంజయ్ కాలనీలో భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు పాల్గొన్నారు.
కరోనాకు కులం, మతం, పేద, ధనిక వ్యత్యాసాలు లేవని... కనిపించని కరోనా ప్రపంచాన్ని కాల్చుకు తింటుందని లక్ష్మణ్ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు పేదలకు కార్యకర్తలు అండగా నిలిచారని... ఎన్నికల సమయంలోనే కాకుండా, ఆపదలో కూడా ప్రజలను ఆదుకోవడంలో తమ పార్టీ కార్యకర్తలు ముందు నిలవడం ఆనందంగా ఉందన్నారు. కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు మే 3 వరకు ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ... స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మహావీర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బస్తీ ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ వేళ వైభవంగా మాజీ సీఎం కుమారుడి వివాహం!