తెలంగాణ

telangana

ETV Bharat / city

Godavari Board Chairman news : సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన జీఆర్​ఎంబీ ఛైర్మన్

సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన జీఆర్​ఎంబీ ఛైర్మన్
సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన జీఆర్​ఎంబీ ఛైర్మన్

By

Published : Nov 14, 2021, 11:15 AM IST

Updated : Nov 14, 2021, 11:57 AM IST

11:12 November 14

సింగూరు ప్రాజెక్టును పరిశీలించిన జీఆర్​ఎంబీ ఛైర్మన్

రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులను పరిశీలించేందుకు జీఆర్​ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్(GRMB chairman chandra shkehar iyer) బృందం పర్యటన మొదలైంది. బోర్డు సభ్యుడు కుటియాల్, ఇంజినీర్లతో కలిసి సింగూరు(Singur Dam) ప్రాజెక్టును పరిశీలించారు. డ్యామ్ ఇంజినీర్లతో ఛైర్మన్ బృందం కాసేపు ముచ్చటించారు. 

అనంతరం.. నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizam Sagar project), అలీసాగర్ (Ali sagar project), గుత్ప ఎత్తిపోతల పథకాల(Gutpa lift irrigation project)ను పరిశీలించేందుకు అయ్యర్ వెళ్తున్నారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన పూర్తైన తర్వాత.. సోమవారం రోజున ఎస్సారెస్పీ (Sriram Sagar project), చౌటుపల్లి హన్మంతురెడ్డి ఎత్తిపోతల పథకాన్ని(Chowtupalli hanmanthureddy lift irrigation) పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లతో చంద్రశేఖర్ అయ్యర్.. ఎస్సారెస్పీ ప్రాజెక్టు వద్ద సమావేశమవుతారు. 

కేంద్రం ఇటీవల ఖరారు చేసిన పరిధికి అనుగుణంగా ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డులకు(River management boards) స్వాధీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది. పర్యటన అనంతరం ప్రాజెక్టుల స్వాధీనం విషయమై బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

కేంద్ర గెజిట్‌ అమలు(central gazette)కు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ(Godavari river management board)) ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 17న ఐదో దఫా ఉపసంఘం సమావేశాన్ని (GRMB Subcommittee Meeting) ఏర్పాటు చేసింది. గెజిట్‌ షెడ్యూల్‌-2లో పేర్కొన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన సభ్యులతో హైదరాబాద్‌లోని జలసౌధలో గెజిట్ అమలుపై ఉ.11 గంటలకు ఉపసంఘం (GRMB Subcommittee Meeting) భేటీ కానుంది. రెండు రాష్ట్రాలకు చెందిన నాలుగు కంపోనెంట్లను బోర్డుకు అప్పగించడంలో భాగంగా తుది నిర్ణయం తీసుకునేందుకు ఎజెండా రూపొందించారు.

కంపోనెంట్లు ఇవీ..

తెలంగాణ పరిధిలోని జె.చొక్కారావు ఎత్తిపోతల పథకంలోని గంగారం పంపుహౌస్‌, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు (ఒకటో దశ) కింద గీసుకొండ సమీపంలో కాకతీయ కాల్వపై ఉన్న క్రాస్‌ రెగ్యులేటర్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో తొర్రిగెడ్డ ఎత్తిపోతల పంపుహౌస్‌, చంగలనాయుడు ఎత్తిపోతల పంపుహౌస్‌

Last Updated : Nov 14, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details