తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల సేవలు అభినందనీయం' - police duties

హైదరాబాద్​ కార్ఖానా పోలీసులకు గ్రీన్​వేస్​ టెక్నాలజీ సంస్థ ఎండీ రాజీవ్​ శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు చేస్తున్న సేవలను కొనియాడారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

green ways company md rajiv distributed sanitizers to police
green ways company md rajiv distributed sanitizers to police

By

Published : Aug 26, 2020, 1:45 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని గ్రీన్ వేస్ టెక్నాలజీ సంస్థ ఎండీ రాజీవ్ కొనియాడారు. పోలీసులు అందిస్తున్న సేవలకు గానూ తమ వంతుగా హైదరాబాద్​ కార్ఖానాలో శానిటైజర్లు పంపిణీ చేశారు. రూ. 2 లక్షల విలువైన 500 లీటర్ల శానిటైజర్ డబ్బాలను కార్ఖానా ఇన్​స్పెక్టర్ మధుకర్ స్వామికి అందజేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో శానిటైజర్​ల వాడకం వల్ల కొంతమేర వైరస్ ను కట్టడి చేయవచ్చనే ఉద్దేశంతోనే పంపిణీ చేస్తున్నట్లు రాజీవ్​ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీసుల సేవలు గుర్తించి శానిటైజర్ లు అందించినందుకు గానూ రాజీవ్​కు ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details