ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పారిశ్రామిక రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం మొత్తం రూ.7,725 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 2.8 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటకలోని తుమకూరు పారిశ్రామిక నోడ్‌లతోపాటు రూ.3,883.80 కోట్లతో దిల్లీ సరిహద్దుల్లోని గ్రేటర్ నోయిడాలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కృష్ణపట్నం, తుమకూరులను గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయనున్నారు.
కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌కు కేంద్రం ఆమోద ముద్ర - ap latest news
మౌలిక వసతుల రంగంలో పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్, కర్ణాటకలోని తుమకూరు పారిశ్రామిక నోడ్‌ల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ప్రతిపాదిత చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాలో అంతర్భాగంగా ఈ రెండింటినీ నిర్మించనున్నట్లు వెల్లడించింది. కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్ అంచనా వ్యయం రూ.2,139.44 కోట్లు కాగా, ‘తుమకూరు’ అంచనా వ్యయం రూ.1,701.21 కోట్లు.
కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్
కృష్ణపట్నం, తుమకూరుల్లో పారిశ్రామికీకరణతో భారీగా ఉపాధి అవకాశాలు పుట్టుకొచ్చే అవకాశముంది. ఒక్క కృష్ణపట్నం నోడ్ తొలి దశ అభివృద్ధి ద్వారానే 98 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 58 వేల మందికి ప్రత్యక్షంగా (సైట్) ఉపాధి దొరుకుతుందని తెలిపింది. తుమకూరు నోడ్‌లో 88,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది.
ఇదీ చూడండి:జంట నగరాల రైల్వే డివిజన్లకు మరోసారి అవార్డు
TAGGED:
krishna patnam