తెలంగాణ

telangana

ETV Bharat / city

'హరితహారం సమాజాన్ని ఆలోచనలో పడేసింది' - 'Green Challenge' updates

సీఎం చేపట్టిన హరిత హారం కార్యక్రమం... పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా సాగుతోందని మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. హరితసవాల్​ల్లో భాగంగా మంత్రుల నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. నేలంతా పచ్చగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్​ సంకల్పమని మంత్రి ఉద్ఘాటించారు.

Green Challenge Movement
గ్రీన్ ఛాలెంజ్: నేను నాటా.. మరి మీరు నాటారా..?

By

Published : Jan 2, 2020, 7:23 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మొదలైన హరితహారం కార్యక్రమం... సమాజాన్ని ఆలోచనలో పడేసిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా సాగాలని.. హరితసవాల్​లో భాగంగా మంత్రుల నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. నేలంతా పచ్చగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్​ సంకల్పమని మంత్రి ఉద్ఘాటించారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు.

గ్రీన్ ఛాలెంజ్: నేను నాటా.. మరి మీరు నాటారా..?

సమాజహితం కోసం గ్రీన్ ఛాలెంజ్

సమాజహితం కోసం గ్రీన్ ఛాలెంజ్ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని జగదీశ్​రెడ్డి కోరారు. పుదుచ్చేరి వైద్యశాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు జెన్ కో, దక్షిణ డిస్కం సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డిలకు మంత్రి సవాల్ విసిరారు. తలా మూడు మొక్కలు నాటాలని కోరారు.

ఇవీ చూడండి: తప్పుల తడకగా ముసాయిదా ఓటర్ల జాబితా

ABOUT THE AUTHOR

...view details