తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ నెల 27న జీహెచ్​ఎంసీ ప్రస్తుత పాలకమండలి సమావేశం - Greater Hyderabad Municipal Corporation Council

ఈ నెల 27న జీహెచ్​ఎంసీ ప్రస్తుత పాలకమండలి సమావేశం కానుంది. ఇదే చివరి సమావేశం కానుండటం వల్ల 2021-22 వార్షిక బడ్జెట్​ను పాత పాలకమండలి ఆమోదించనుంది.

Greater Hyderabad Municipal Corporation Council Meeting
ఈ నెల 27న జీహెచ్​ఎంసీ ప్రస్తుత పాలకమండలి సమావేశం

By

Published : Jan 18, 2021, 2:56 PM IST

జనవరి 27న జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి సమావేశం జరగనుంది. ప్రస్తుత పాలకమండలి సభ్యులకు ఇదే చివరి సమావేశం కానుంది. ఇందులో 2021-2022 వార్షిక బడ్జెట్​ను జీహెచ్ఎంసీ పాత పాలక మండలి ఆమోదించనుంది.

గత నెలలో కొత్త పాలక మండలి కోసం ఎన్నికలు నిర్వహించింది. ఇటీవల గెలుపొందిన సభ్యుల పేర్లతో ఎస్‌ఈసీ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరి పాలక మండలి సమావేశం తర్వాత కొత్త పాలకవర్గం కొలువు తీరనుంది.

ABOUT THE AUTHOR

...view details