ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ కుటుంబం.. తమ పెంపుడు కుక్క చనిపోతే సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణానికి చెందిన ఆవుల భాస్కర్ రెడ్డి, లత దంపతులు 17 ఏళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. వారికి పిల్లలు లేని కారణంగా.. ఆ శునకమే సర్వస్వం అన్నట్లుగా వాళ్లు ఇన్నాళ్లు జీవనం సాగించారు. టామీ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
పెంపుడు శునకం మృతి....శాస్త్రోక్తంగా అంత్యక్రియలు - great funeral for the dog in karnool district
అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం చనిపోయింది. తమలో ఒకరిగా కలియదిరిగిన గ్రామ సింహం.. మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. కన్నీటి పర్యంతమైంది. కుక్కే కదా అని వదిలివేయకుండా.. ఆ శునకానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించారు. ఈ వింత ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది.

పెంపుడు శునకం మృతి....శాస్త్రోక్తంగా అంత్యక్రియలు
కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న శునకం కన్నుమూసింది. తమ టామీ ఇక రాదని తెలిసి ఆ దంపతులు గుండెలవిసేలా రోధించారు. డప్పు చప్పుళ్లతో ఆ కాలభైరవుడి మృతదేహానికి ఊరేగింపు చేశారు. శ్మశాన వాటికలో వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ప్రక్రియ పూర్తి చేశారు.
పెంపుడు శునకం మృతి....శాస్త్రోక్తంగా అంత్యక్రియలు
ఇవీ చదవండి: ఏటీఎం ఎత్తుకెళ్లిన దుండగులు