హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్టు తన మనసులో మాట చెప్పారు. పదోన్నతి కోసమే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. రాజకీయ జీవితమంతా కాంగ్రెస్తోనేన్న ఆయన.. భాజపాలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లనని స్పష్టం చేశారు.
'పీసీసీ' ఆశిస్తున్నా.. అందుకే రాజీనామా: అంజన్ కుమార్ - నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా
పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్టు.. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అందుకే రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపాలో చేరేది లేదని స్పష్టం చేశారు.
'పీసీసీ' ఆశిస్తున్నా.. అందుకే రాజీనామా: అంజన్ కుమార్
గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో తన ప్రమేయమేమీ లేదని, ప్రతి నియోజకవర్గానికో పెద్ద నాయకుడు ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి అపనింద తనపై పడటం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికల బాధ్యతను చూశానని నిస్సాహాయత వెలిబుచ్చారు.
Last Updated : Dec 10, 2020, 8:02 PM IST