తెలంగాణ

telangana

ETV Bharat / city

Temple for parents: తల్లిదండ్రులకు ప్రేమతో ఆలయ నిర్మాణం - గుంటూరు తాజా వార్తలు

Temple for parents: ఏపీలోని గుంటూరుకు చెందిన క్రేన్‌ సంస్థల అధినేత గ్రంథి వెంకట సత్యలక్ష్మీకాంతారావు గుంటూరు సమీపంలో నిర్మిస్తున్న ఆలయంలో.. తన తల్లిదండ్రులకు మందిరం కట్టిస్తున్నారు. అమ్మానాన్నల విషయంలో అందర్నీ ఆలోచింపజేయాలని, సృష్టిలో వారి గౌరవాన్ని ఇనుమడింపజేయాలనే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Temple for parents
Temple for parents

By

Published : Jun 6, 2022, 11:54 AM IST

Temple for parents: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకు చెందిన క్రేన్‌ సంస్థల అధినేత గ్రంథి వెంకట సత్యలక్ష్మీకాంతారావు గుంటూరు సమీపంలో నిర్మిస్తున్న ఆలయంలో.. తన తల్లిదండ్రులకు ఆలయం నిర్మిస్తున్నారు. ఇందుకోసం స్థానిక కళాకారులతో తల్లిదండ్రులు లక్ష్మీనరసమ్మ, సుబ్బారావుల కాంస్య విగ్రహాలను తయారు చేయించారు. వీటిని సోమవారం త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి ఆవిష్కరించనున్నారు.

మందిరం వద్ద సత్యలక్ష్మీకాంతారావు దంపతులు

‘ప్రస్తుత తరానికి స్ఫూర్తినిచ్చేందుకే అమ్మానాన్నలకు మందిరం నిర్మిస్తున్నా. అమ్మానాన్నల విషయంలో అందర్నీ ఆలోచింపజేయాలని, సృష్టిలో వారి గౌరవాన్ని ఇనుమడింపజేయాలనే ఈ ప్రయత్నం’ అని సత్యలక్ష్మీకాంతారావు తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details