హైదరాబాద్లో 'బోనాలు జానపద జాతర' ఉత్సవాలు సందడిగా జరిగాయి. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తెలుగు రాష్ట్రాల కళాకారులు పాల్గొని.. ఆట పాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు రమణా రావు పాల్గొన్నారు.
గత ఏడు సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాటేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను రమణారావు నిర్వహించారని.. వేణుగోపాలాచారి ప్రశంసించారు. ఎంతోమంది నూతన కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీశారని కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఎన్నో కార్యక్రమాలు రమణారావు నిర్వహిస్తున్నారని.. ప్రశంసలు కురిపించారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ నిర్వహించే ఏ కార్యక్రమాలైనా వైవిధ్యభరితంగా ఉంటాయన్నారు.