తెలంగాణ

telangana

ETV Bharat / city

అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు - జాతీయ జెండా ఎగురవేసిన కేసీఆర్​

రాష్ట్రవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసుల కవాతులు, కళాకారుల నృత్య ప్రదర్శనలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోలీసు బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించిన ప్రజాప్రతినిధులు... గణతంత్ర స్ఫూర్తిని నేటితరం ఆచరణలోకి తీసుకుని ముందుగు సాగాలని ఆకాంక్షించారు.

republic day celebrations
అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు

By

Published : Jan 26, 2021, 6:06 PM IST

అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో జెండా ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళి అర్పించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అంతరాలు తొలిగిపోయేలా..

శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి రావడం దేశానికే గర్వకారణమని స్పీకర్‌ పోచారం పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో అంతరాలు తొలిగిపోయేలా తీసుకొచ్చిన రాజ్యాంగం లౌకిక స్ఫూర్తిని ప్రతిభింబిస్తుందని కొనియాడారు.

నాంపల్లి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

పార్టీల కార్యాలయాల్లో..

రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెరాస ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తోందని ప్రశంసించారు. అంబేడ్కర్‌ ఆశయాలను ఇంకా సాధించలేకపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మువ్వన్నెల జెండాను ఎగురవేయగా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.

గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉత్తమ్‌.. దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పురోగమించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ జాతీయపతాకం ఆవిష్కరణలో కితాబిచ్చారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు కోదండరాం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

జీహెచ్​ఎంసీలో..

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేశ్​ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. మేయర్ బొంతు రామ్మోహన్ సహా పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అమీర్‌పేట్‌ హెచ్​ఎండీఏ ప్రధాన కార్యాలయంలో సెక్రెటరీ, ఎండీ సంతోష్ జాతీయజెండా ఎగురవేశారు.

డీజీపీ కార్యాలయంలో..

డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ బాలనాగా దేవీ.. మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేశ్ భగవత్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మేడ్చల్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ విద్యాసాగర్​రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంఛార్జ్​ ఛైర్మన్, కార్యదర్శి వాణీప్రసాద్ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.

ఇవీచూడండి:ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ: గవర్నర్​

ABOUT THE AUTHOR

...view details