‘‘రాష్ట్రంలో వచ్చేవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం అవుతాయి. ప్రస్తుత సీజన్‌లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి. ధాన్యంలో 17 శాతంలోపు తేమ ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు తక్షణం దించుకోవాలి’’ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
గురువారం పౌరసరఫరాల భవన్‌లో అధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రి, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.