ఏ సమస్యల సాధన కోసం తెలంగాణ ఏర్పాటైందో ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావు అన్నారు. రాష్ట్ర యువతను నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుందని తెలిపారు.
గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై శాసన మండలిలో ప్రశ్నిస్తూ వస్తున్నానని.. తన గొంతును మరింత వినిపించేందుకు మళ్లీ బలపరచాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.