cooking oil prices: రష్యా- ఉక్రెయిన్ల యుద్ద పరిస్థితులను కారణంగా చూపి వ్యాపారస్థులు నూనె ధరలను ఇష్టారాజ్యంగా పెంచేశారు. దానికి తోడు నూనెల ధరలు పెరుగుతాయనే వార్తలతో బెంబేలెత్తిన ప్రజలు నెలలకి సరిపడా కొని స్టాక్ పెట్టుకోవడంతో డిమాండ్ మరింత పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం వంట నూనెల ధరల పెరుగుదలకు అడ్డుకట్టవేసేందుకు చర్యలు వేగవంతం చేసింది.
క్రమంగా దిగివస్తున్న వంటనూనె ధరలు..! - cooking oil prices
cooking oil prices: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి భారత్‌కు వంటనూనె దిగుమతులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో భారత్లో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి.
cooking oil prices
పామాయిల్ దిగుమతులపై ఆంక్షల సడలింపుతో కొంతవరకు ధరలు దిగివస్తుండగా.. మరోవైపు షాపులపై టాస్క్ఫోర్స్ దాడులు పెరగడంతో వ్యాపారస్థులు తక్కువ ధరలకే అందించడం ప్రారంభించారు. అయితే అన్ని ప్రాంతాల్లో దాడులను ముమ్మరం చేసి ధరలను కంట్రోల్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:Boiled Rice Issue : 'బాయిల్డ్ రైస్ కొనేదే లేదు'.. తేల్చి చెప్పిన కేంద్రం