తెలంగాణ

telangana

ETV Bharat / city

Tenth grades:  పది మార్కులపై తుది నిర్ణయం..

కరోనా దృష్ట్యా పదో తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా.. ఫలితాల వెల్లడికి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ.. మార్కుల కేటాయింపునకు సంబంధించి తుది నిర్ణయానికి వచ్చింది. 50 మార్కులకు పెట్టిన ఫార్మెటివ్‌ పరీక్షలో.. 20 మార్కుల రాత పరీక్షకు 70శాతం, ఇతర 30 మార్కులకు 30శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున రెండు ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించారు.

Grade system in tenth class students in andhra pradesh
Grade system in tenth class students in andhra pradesh

By

Published : Jul 12, 2021, 9:45 PM IST

Updated : Jul 15, 2021, 12:38 PM IST

పది మార్కులపై తుది నిర్ణయం..

కరోనా దృష్ట్యా పదో తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా.. ఫలితాల వెల్లడికి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ.. మార్కుల కేటాయింపునకు సంబంధించి తుది నిర్ణయానికి వచ్చింది. 50 మార్కులకు పెట్టిన ఫార్మెటివ్‌ పరీక్షలో.. 20 మార్కుల రాత పరీక్షకు 70శాతం, ఇతర 30 మార్కులకు 30శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున రెండు ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించారు.

మార్కుల మదింపు ఇలా..

ఫార్మెటివ్‌-1లో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకొని, వాటిని సరాసరి చేస్తారు. ఒక సబ్జెక్టు సరాసరి మార్కులు వస్తాయి. ఇలాగే ఫార్మెటివ్‌-2ను చేస్తారు. ఈ రెండింటిని కలిపి పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు 50మార్కులకు నిర్వహించిన ఫార్మెటివ్‌-1 సరాసరిన 45మార్కులు రాగా.. ఫార్మెటివ్‌-2లో 47 మార్కులు వస్తే ఈ రెండు కలిపి 92మార్కులుగా తీసుకుంటారు. దీని ఆధారంగా మొత్తం గ్రేడ్‌, సబ్జెక్టు గ్రేడ్‌ ఇస్తారు. అంతర్గత మార్కుల విధానం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.

గతేడాదికీ మార్కులు:

గతేడాది(2019-20) పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, ఎలాంటి మార్కులూ ఇవ్వలేదు. అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఆర్మీ ఉద్యోగాలకు మార్కులు అవసరం అవుతున్నందున విద్యార్థుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. మార్కులు కావాలని అడిగిన వారికి ఇప్పటి వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తోంది. విద్యార్థులందరికీ మార్కులు ఇచ్చేందుకు ఛాయరతన్‌ కమిటీ సిఫార్సు చేసింది. పిల్లల సమస్య దృష్ట్యా అందరికీ గ్రేడ్లు, గ్రేడ్‌పాయింట్లు ఇవ్వాలని సూచించింది.

ఇదీ చదవండి:

WARANGAL:వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాల పేర్లు మార్పు

Last Updated : Jul 15, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details