ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళతానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. తనకున్న అధికారాలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉండటం సంతోషకరమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు.. విభజన అంశాలపై ఇప్పటికే చర్చించుకున్నారని... ఈ పద్ధతి బాగుందన్నారు. కేంద్రం దీనిని పర్వవేక్షిస్తుందని తెలిపారు. తనను ఏపీ గవర్నర్‌గా నియమించిన రాష్ట్రప్రతి రామ్‌నాథ్ కోవింద్, అందుకు సహకరించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశా ప్రజలు, పూరి జగన్నాథ్ ఆశీర్వాదంతోనే ఈ గౌరవం దక్కిందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఏపీ అభివృద్ధికి కృషిచేస్తా: గవర్నర్ బిశ్వభూషణ్ - గవర్నర్ బిశ్వభూషణ్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులవడం సంతోషంగా ఉందని బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన రాష్ట్రప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఏపీ నూతన గవర్నర్‌తో "ఈటీవీ భారత్" ప్రత్యేక ఇంటర్వ్యూ....
ఏపీ అభివృద్ధికి కృషిచేస్తా: గవర్నర్ బిశ్వభూషణ్