Teachers Protest on GO 317: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా... హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు స్టేట్ స్పౌస్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. 317 జీవో కారణంగా భార్యాభర్తలూ వేరు వేరు చోట్ల విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోకుండా... నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
'భార్యాభర్తలకు ఓకేచోట పోస్టింగ్ ఇవ్వకుంటే.. పిల్లల సంగతేంటి..?'
Teachers Protest on GO 317: హైదరాబాద్ లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. 317 జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటూ స్టేట్ స్పౌస్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
19 జిల్లాలలో బదిలీలు జరిగాయని... 13 జిల్లాలలో ఆదేశాలను అమలు చేయలేదన్నారు. భార్యాభర్తలు వేరువేరుగా దూరప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల తమ పిల్లలను చూసుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వెంటనే సంబంధిత అధికారులు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున గురువులను పూజించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడంపై వారు మండిపడ్డారు.
ఇవీ చదవండి: