సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్ జోషి పుట్టిన రోజు కానుకగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.30 వేలు విరాళం అందజేశారు. దేశమంతా కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి.. తన వంతు సాయంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. మే 1న తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ ముప్పై వేల ఒక్కరూపాయి చెక్కును ఎస్బీఐ బ్యాంకు మేనేజర్‌కు ప్రధాన మంత్రి సహాయ నిధిలో జమ చేసే నిమిత్తం అందజేసినట్టు తెలిపారు. శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండల పరిషత్తు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.
పుట్టినరోజు కానుక.. ప్రధాని సహాయనిధికి రూ. 30వేలు - Govt Employ Donates To Prime Minister Relief Fund
ప్రధానమంత్రి సహాయ నిధికి ఓ ప్రభుత్వ ఉద్యోగి పుట్టినరోజు సందర్భంగా రూ.30వేలు విరాళం అందించారు. కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి తనవంతు సహాయంగా విరాళం ఇస్తున్నట్టు తెలిపారు.
![పుట్టినరోజు కానుక.. ప్రధాని సహాయనిధికి రూ. 30వేలు Govt Employ Donates To Prime Minister Relief Fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7006482-751-7006482-1588254576287.jpg)
పుట్టినరోజు కానుకగా.. ప్రధానమంత్రి సహాయనిధికి విరాళం!