తెలంగాణ

telangana

ETV Bharat / city

పోటీ ప్రపంచంలో కేవలం పట్టాలు సంపాదిస్తే సరిపోదు: గవర్నర్​

మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, దేశీయ చింతనై కళగం సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆన్​లైన్​ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు. ప్రపంచానికి నైపుణ్యాలున్న మానవవనరులను అందించే దేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతోందన్నారు. మహనీయుల స్ఫూర్తితో విద్యార్ధులు, యువత.. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, తాము ఎంచుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

పోటీ ప్రపంచంలో కేవలం పట్టాలు సంపాదిస్తే సరిపోదు: గవర్నర్​
పోటీ ప్రపంచంలో కేవలం పట్టాలు సంపాదిస్తే సరిపోదు: గవర్నర్​

By

Published : Jul 15, 2020, 10:34 PM IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం పట్టాలు సంపాదిస్తే సరిపోదని, సరైన నైపుణ్యాలు కలిగి ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని గవర్నర్ తమిళిసై అన్నారు. మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, దేశీయ చింతనై కళగం సంస్థలు సంయుక్తంగా కామరాజార్ జన్మదినం, ఎడ్యుకేషన్ డెవలప్​మెంట్ డే, వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్​మెంట్ అన్న అంశంపై ఆన్​లైన్​లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు.

ప్రపంచానికి నైపుణ్యాలున్న మానవవనరులను అందించే దేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతోందని, నేషనల్ స్కిల్ డెవలప్​మెంట్ మిషన్ ద్వారా 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని గవర్నర్ తెలిపారు. నిరంతర ధ్యానంతో, యువత శ్రద్ధను, ఏకాగ్రత శక్తిని అభివృద్ధది చేసుకోగలరని తమిళిసై అభిప్రాయపడ్డారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కామరాజ్ గొప్ప స్ఫూర్తినిచ్చే నాయకుడని గవర్నర్ కొనియాడారు. అతి సాధారణ జీవనం, నిరాడంబరత్వం, పారదర్శక పాలనతో తమిళనాడుకు, దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చారని తమిళిసై తెలిపారు. అలాంటి వారి అడుగుజాడల్లో ప్రధానమంత్రి మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో విద్యార్ధులు, యువత.. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని, తాము ఎంచుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details