తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆదాయ రంగాలకు మహిళలు దూరం: గవర్నర్ - ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్

దేశంలో దాదాపు 70 శాతం మహిళలు ఆదాయం వచ్చే పనులకు దూరంగా ఉన్నారని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. ఇది... శాస్త్ర, పరిశోధన రంగాల అభివృద్ధికి మంచిది కాదన్నారు.

governor thamili sai soundara rajan participate in india international science festival
దాదాపు 70 శాతం మహిళలు ఆదాయం వచ్చే పనులకు దూరం: గవర్నర్

By

Published : Dec 22, 2020, 8:49 PM IST

సైన్స్, పరిశోధన రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాల్సి ఉందని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఎన్విరాన్​మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల సదస్సులో గవర్నర్ పాల్గొన్నారు.

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆత్మ నిర్భర్ భారత్​లో మహిళల పాత్ర అనే అంశంపై ప్రసంగించిన గవర్నర్... దేశంలో దాదాపు 70శాతం మహిళలు ఆదాయం వచ్చే పనులకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని సైంటిస్టులలో కేవలం 14శాతం మంది మహిళలు ఉండటాన్ని ప్రస్తావించిన గవర్నర్ ఇది సైన్స్, పరిశోధనా రంగాల అభివృద్ధికి మంచిది కాదన్నారు.

ఇదీ చూడండి:కొత్త వైరస్ రాకుండా ముందస్తు చర్యలు: శ్రీనివాసరావు

ABOUT THE AUTHOR

...view details