తెలంగాణ

telangana

ETV Bharat / city

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్​ కృషి అభినందనీయం: గవర్నర్ - governor tamilsai spoke on kaleshwaram project

పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ముందుకుసాగినప్పుడే సాంకేతికతకు అర్థం ఉంటుందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్​ సభలో పాల్గొన్న ఆమె పర్యావరణాన్ని కాపాడే విధంగా నిర్మాణాలు ఉండాలని ఇంజినీర్లకు పిలుపునిచ్చారు.

governor tamilsai spoke on kaleshwaram project
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్​ కృషి అభినందనీయం: గవర్నర్

By

Published : Dec 27, 2019, 12:17 PM IST

Updated : Dec 27, 2019, 12:53 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్​ కృషి అభినందనీయం: గవర్నర్

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్​ కృషి అద్భుతమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ కితాబిచ్చారు. హైదరాబాద్​లోని హెచ్​ఐసీసీలో జరుగుతున్న 34వ ఇండియన్​ ఇంజినీరింగ్​ కాంగ్రెస్​ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సాంకేతికత.. పేదల బతుకు మార్చేందుకు ఉపయోగపడాలని గవర్నర్​ ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ ప్రతిభ, పనితీరుకు పదును పెట్టాలన్నారు. ఇంజినీరింగ్ విభాగం కృషి దేశాభివృద్ధికి దోహదపడాలని తమిళిసై తెలిపారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతో ఉందని గవర్నర్ తెలిపారు. ఇంజినీర్లు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని తమిళి సై సూచించారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యేను కలిసేందుకు 90 కి.మీ పాదయాత్ర

Last Updated : Dec 27, 2019, 12:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details