శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో భక్తితో ప్రజలు దేశవ్యాప్తంగా శ్రీరామనవమిని జరపుకుంటారన్న గవర్నర్... ఆదర్శ గుణాలు కలిగిన శ్రీరాముడు భయాలను, చెడును పారద్రోలుతారని అన్నారు.
శ్రీరాముడి ఆశీర్వాదంతో కరోనాపై పోరాడుదాం : తమిళిసై - తెలంగాణ వార్తలు
శ్రీరామచంద్ర ప్రభువు ఆశీర్వాదంతో కొవిడ్‌పై అందరూ విజయవంతంగా పోరాడి అధిగమించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ప్రజలకు ఆమె శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
దేశప్రజలకు గవర్నర్ తమిళిసై శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీరామచంద్ర ప్రభువు ఆశీర్వాదంతో కరోనా మహమ్మారిపై అందర విజయవంతంగా పోరాడి అధిగమించాలని తమిళిసై ఆకాంక్షించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి అందరూ శ్రీరామనవమి వేడుకలు చేసుకోవాలన్న గవర్నర్... అవసరమైన జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ