తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈఎస్​ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు... కేంద్ర మంత్రికి గవర్నర్ కృతజ్ఞత - గవర్నర్​ తమిళి సై కృతజ్ఞతలు

కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్​ కుమార్ గాంగ్వార్​కు గవర్నర్​ తమిళి సై ట్విటర్​ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్​లోని ఈఎస్ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు, కొవిడ్ ఐసీయూలతో పాటు.. రోజుకు మూడు వేల పరీక్షలు చేసే యంత్రాన్ని మంజూరు చేసినట్లు గవర్నర్​ తెలిపారు.

'ఈఎస్​ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు, ఐసీయూలు మంజూరు'
'ఈఎస్​ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు, ఐసీయూలు మంజూరు'

By

Published : Jul 13, 2020, 9:32 PM IST

హైదరాబాద్​లోని ఈఎస్ఐ ఆస్పత్రికి వెంటిలేటర్లు, కొవిడ్ ఐసీయూలతో పాటు.. రోజుకు మూడు వేల పరీక్షలు చేసే యంత్రాన్ని మంజూరు చేసేందుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్​ కుమార్ గాంగ్వార్ అంగీకరించారు. కేంద్ర మంత్రితో ఫోన్లో మాట్లాడిన సమయంలో ఐసీయూలు, పరీక్షల యంత్రం మంజూరుకు అంగీకరించినట్లు గవర్నర్ తమిళి సై తెలిపారు.

అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రికి గవర్నర్ ట్విట్టర్​ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈఎస్ఐ వసతి లేని పేదలకు ఉచితంగా, ఇతరులకు నామమాత్రపు రుసుముతో.. ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ వసతి వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details