గిరిజన అభివృద్ధి, ఆరోగ్య సంబంధిత అంశాల((tamilisai speech on Health & vaccination initiatives))పై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రసంగించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 51వ గవర్నర్ల సదస్సు(51st conference of governors and lieutenant governors) జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత వహించారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన ప్రజల్లో పోషకాహార లోపాన్ని గుర్తించేందుకు ఎన్ఐఎన్, ఈఎస్ఐ మెడికల్ కళాశాల, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలతో కలిసి గవర్నర్ చేపట్టిన పైలెట్ ప్రాజెక్ట్ గురించి తమిళసై వివరించారు.
ఆరుగురిలో తమిళిసై ఒకరు..
ఆదిలాబాద్, భద్రాద్రి, నగర్ కర్నూల్ జిల్లాల్లో గవర్నర్ ఈ ప్రాజెక్టుని చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో గిరిజనుల్లో పోశాఖహార సమస్యలపై అధ్యాయనం చేయనున్నారు. వీటితో పాటు.. కొవిడ్ సమయంలో ప్రజలకు చేరువయ్యేందుకు హైదరాబాద్ రాజ్‌భవన్, పుదుచ్చేరిలో చేపట్టిన కార్యక్రమాల గురించి గవర్నర్ వివరించారు. ఈ సదస్సులో ప్రసంగించేందుకు మొత్తం ఆరుగురు గవర్నర్లు ఎంపిక కాగా అందులో తమిళసై సౌందర రాజన్ ఒకరు.