'తెలుగు, తమిళ ప్రజలు స్నేహపూర్వకంగా మెలగాలి' - tamilisai visited chennai for ayudha puja
తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక బంధం ఏర్పడాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ దసరా పండుగ రోజున ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
తెలుగు, తమిళ ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆయుధ పూజను పురస్కరించుకుని ఆమె తమిళనాడు వెళ్లారు. ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు. తను గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేటప్పడికే.. రాజ్‌భవన్‌లో ప్లాస్టిక్ వాడకం నిషేధించారని, ప్రధాని మోదీ ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాజ్‌భవన్ ఉద్యోగులకు యోగా శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. తనతో సహా రాజ్‌భవన్‌లోని అధికారులు, ఉద్యోగులంతా ఉదయాన్నే యోగా చేస్తున్నామని తెలిపారు. ఆయుధ పూజ రోజున స్వరాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు.
- ఇదీ చూడండి : దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే అదిరిపోయే స్టెప్పులు..!
TAGGED:
telangana governor tamilisai