Governor Tamilisai on Ibrahimpatnam Issue: వేగంగా ఎక్కువ మందికి శస్త్రచికిత్సలు చేయాలనే లక్ష్యమే ఇబ్రహీంపట్నంలో కు.ని ఆపరేషన్లు వికటించటానికి కారణంగా భావిస్తున్నట్టు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పేర్కొన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను ఆమె పరామర్శించారు. వారి బాగోగులను అడిగితెలుసుకున్నారు. చికిత్స సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని ఆరా తీశారు. చికిత్స పొందుతున్న 11 మంది బాధితులకు గవర్నర్ తమిళిసై ఆర్థిక సాయం ప్రకటించారు. గవర్నర్ నిధుల నుంచి రూ.10వేల చొప్పున సాయం అందిస్తునట్టు వెల్లడించారు.
నిమ్స్‌లో కు.ని బాధితులకు గవర్నర్ పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటన - గవర్నర్ తమిళిసై తాజా వార్తలు
Governor Tamilisai on Ibrahimpatnam Issue: ఆపరేషన్‌లు అధికంగా చేయాలనే లక్ష్యంతో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదు అని గవర్నర్ తమిళిసై అన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందతున్న ఇబ్రహీంపట్నం కు.ని బాధితులను పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న 11 మంది బాధితులకు గవర్నర్ ఆర్థిక సాయం ప్రకటించారు.
![నిమ్స్‌లో కు.ని బాధితులకు గవర్నర్ పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటన Governor Tamilisai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16280210-993-16280210-1662277738236.jpg)
Governor Tamilisai
బాధితులకు పండ్లు పంపిణీ చేసిన గవర్నర్ మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ పూర్తైన తర్వాత అసలు కారణాలు తెలుస్తాయని గవర్నర్ వివరించారు. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత నెల 26న 34 మంది కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసుకోగా నలుగురు మృతిచెందారు. దీంతో మిగతా వారికి నగరంలోని వేరు వేరు ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తున్నారు.
నిమ్స్‌లో కు.ని బాధితులకు గవర్నర్ పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటన
ఇవీ చదవండి:
Last Updated : Sep 4, 2022, 1:43 PM IST