మహిళలు ఎంట్రప్రిన్యూయర్లుగా మారటం చాలా సంతోషకరమైన విషయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఆత్మ నిర్భర్ భారత్ స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ బ్యాచ్-1 వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజ్‌భవన్ పరివార్ మహిళల కోసం అలీప్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
'మహిళలు ఆర్థికంగా బలపడితే.. ఆ కుటుంబం స్థిరపడినట్టే..' - రాజ్‌భవన్‌లో ఆత్మ నిర్భర్ భారత్ స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ
హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఆత్మ నిర్భర్ భారత్ స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ బ్యాచ్-1 వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ తమిళిసై... కోర్సు పూర్తి చేసుకున్న మహిళలందరికి అభినందనలు తెలిపారు.

కోర్సు పూర్తి చేసుకున్న మహిళలందరికి గవర్నర్ అభినందనలు తెలిపారు. మహిళల వద్ద డబ్బులుంటే కుటుంబానికి ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. తాము ఉపయోగించే అన్ని వస్తువులు స్థానికంగా లభ్యం అయ్యేలా అభివృద్ధి చెందాలని తమిళిసై ఆకాంక్షించారు. కొవిడ్ కష్టకాలంలో కష్టపడిన ఫస్ట్ లైన్ వారియర్స్ సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు.
కరోనా వైరస్ ఇంకా పోలేదన్న తమిళిసై... అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టీకా ఉత్పత్తిలో భారత్... ముఖ్యంగా హైదరాబాద్... ప్రధాన పాత్ర పోషించటం ఎంతో గర్వ కారణమని గవర్నర్ తెలిపారు.