క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ... పండుగను చేసుకుందామని సూచించారు. ఈ ప్రపంచాన్ని మరింత సంపన్నంగా, శాంతియుతంగా మార్చుకునేందుకు తీర్మానించుకుందామని గవర్నర్ పిలుపునిచ్చారు. అందరికీ అవధుల్లేని సంతోషం, ప్రశాంతత క్రిస్మస్ పండుగ తీసుకురావాలని తమిళిసై ఆకాంక్షించారు. ప్రేమ, క్షమించే గుణం, నిజాయితీ, కరుణ, సోదరభావం, త్యాగాలకు జీసస్ జీవితం ప్రతీక అని వివరించారు. జీసస్ జన్మదినాన్ని జరుపుకునేందుకు ఇదో మంచి రోజని గవర్నర్ పేర్కొన్నారు.
క్రైస్తవులకు గవర్నర్, సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు - గవర్నర్ క్రిస్టమస్ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే పండుగను చేసుకోవాలని సూచించారు. పండుగ పూట అందరి జీవితాల్లో అవధుల్లేని సంతోషం, ప్రశాంతత నిండాలని ఆకాంక్షించారు.
క్రైస్తవులకు గవర్నర్ తమిళిసై క్రిస్మస్ శుభాకాంక్షలు
యేసు క్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ..!
Last Updated : Dec 24, 2020, 4:33 PM IST