Governor Tamilisai independence day wishes: 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం మన దేశ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన రోజని గవర్నర్ అభివర్ణించారు. స్వాతంత్ర్యం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న దృష్ట్యా ఆజాది కా అమృత్ మహోత్సవాల పేరుతో దేశమంతా వేడుకలు జరుపుకుంటున్నారని సౌందరరాజన్ తెలిపారు. లెక్కలేనన్ని త్యాగాలు, అవిశ్రాంత పోరాటాల తర్వాత మనం వలసపాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్య్రం సాధించామని గుర్తుచేశారు. ఇలాంటి చారిత్రాత్మక ఘటనల సమయంలో మన జాతీయ జెండా, త్రివర్ణపతాకం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం మన కర్తవ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు - Governor Tamilisai soudara rajan speech
Governor Tamilisai independence day wishes రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుందామని సూచించారు.
governor-tamilisai-soudara-rajan-76th-independence-day-wishes
"76వస్వాతంత్య్ర దినోత్సవం మన దేశ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన రోజు. స్వతంత్రం సిద్ధించిన 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుందాం. ఆత్మ నిర్భర్ భారత్ నిజమైన స్ఫూర్తితో భారతదేశాన్ని అన్ని అంశాలలో బలమైన, సురక్షితమైన, స్వావలంబనంగా మార్చాలని సంకల్పిద్దాం.స్వాతంత్య్రం తరువాత భారతదేశం అన్ని రంగాలలో అపారమైన పురోగతిని సాధించింది. ప్రస్తుతం మనం దాని ప్రయోజనాలను పొందుతున్నాం."- తమిళసై సౌందరరాజన్, గవర్నర్
ఇవీ చూడండి: