రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామక దస్త్రంపై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు. ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు పేర్లతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన సిఫార్సులను పరిశీలించిన గవర్నర్... తుది నియామకాన్ని ఖరారు చేశారు. ఈ రాత్రి లేదా రేపు... విద్యాశాఖ నియామక ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్ టీయూహెచ్, శాతవాహన, అంబేడ్కర్, తెలంగాణ, మహాత్మగాంధీ, పాలమూరు, తెలుగు యూనివర్సిటీ, జేఎన్ఏఎఫ్ విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించనున్నారు.
విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామక దస్త్రంపై గవర్నర్ సంతకం - tamilisai sign on universities vc appointments file
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీల నియామక దస్త్రంపై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు. ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు పేర్లతో సీఎంఓ నుంచి అందిన సిఫార్సులను పరిశీలించిన గవర్నర్... తుది నియామకాన్ని ఖరారు చేశారు. విద్యాశాఖ నియామక ఉత్తర్వులు జారీ చేయటమే మిగిలి ఉంది.
governor tamilisai sign on universities vc appointments
యూనివర్సిటీలకు 2019 జూన్ నుంచి ఐఏఎస్ అధికారులు ఇంఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు. వీసీల నియామకానికి 2019 జులైలోనే దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 150 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియ వేగంగా జరగపోవడంపై విద్యావేత్తలతో పాటు గవర్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాయి. ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు పేర్లను సీఎం కార్యాలయానికి పంపించాయి. వరస ఎన్నికలు, కరోనా ప్రభావం వల్ల ప్రక్రియ ఇన్ని రోజులు ఆలస్యమైంది.