సమ్మెపై ఫిర్యాదులు వస్తున్నాయి.. చర్యలు తీసుకోండి: గవర్నర్ - ఆర్టీసీ సమ్మె గవర్నర్ ఆరా
17:27 October 17
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై దృష్టి సారించిన గవర్నర్... అధికారుల నుంచి వివరణ కోరారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ... సమ్మె పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను తమిళిసైకి వివరించారు. సమ్మెపై తనకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, ఎవరూ ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సునీల్ శర్మను గవర్నర్ ఆదేశించారు.
ఇదీ చూడండి: "ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం"