కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు సమావేశం కానున్నారు. కొవిడ్ ఐసోలేషన్ సౌకర్యాలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఉదయం 11 గంటలకు చర్చించనున్నారు. కరోనా చికిత్స, పడకలు, బిల్లులు, పరీక్షలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈ విషయాలను తమిళిసై ట్వీట్ చేశారు. గవర్నర్ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజన్లు... కరోనా చికిత్స, తదితరాలకు సంబంధించిన పలు సమస్యలు, అంశాలను ప్రస్తావించారు. వాటన్నింటినీ నోట్ చేసుకున్నానని, పరిష్కారంపై దృష్టి సారిస్తామని గవర్నర్ తిరిగి సమాధానం ఇచ్చారు.
ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై చర్చ - ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో రేపు గవర్నర్ తమిళిసై
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై ఈరోజు ఉదయం 11 గంటలకు చర్చించనున్నారు. ప్రజల నుంచి వస్తోన్న ఫిర్యాదులపై ఆసుపత్రుల ప్రతినిధులతో మాట్లాడాతారు. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, వైద్య-ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శికి రాజ్ భవన్ నుంచి పిలుపు అందింది.
ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, వైద్య-ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శికి రాజ్ భవన్ నుంచి పిలుపు అందింది. కొవిడ్ నేపథ్యంలోతన ప్రయత్నాలను గత మూడు నెలలుగా నిరంతరాయంగా చేస్తున్నానన్న గవర్నర్... ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు నిమ్స్ ఆసుపత్రినిసందర్శించానని, కాళోజీ విశ్వవిద్యాలయ ఉపకులపతి, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతోనూ మాట్లాడినట్లు చెప్పారు. నెటిజన్లు లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకున్నానని, పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?