కరోనా మహమ్మారి సమయంలో ఆయిల్ కంపెనీలు అద్భుత పనితీరును ప్రదర్శించాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిన సమయంలో అవసరమైన నిత్యావసర, అత్యవసర వస్తువుల రవాణాలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాన్ని నిరంతర సరఫరా చేశాయని గవర్నర్ పేర్కొన్నారు. ఈ సేవలకు గుర్తింపుగా రాజ్ భవన్లో ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులను గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు.
ఆ సమయంలో ఆయిల్ కంపెనీలు అద్భుతంగా పనిచేశాయి: గవర్నర్ - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు అద్భుత పనితీరును కనబరిచాయని గవర్నర్ కొనియాడారు. ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులను గవర్నర్ అభినందించారు.
ఆ సమయంలో ఆయిల్ కంపెనీలు అద్భుతంగా పనిచేశాయి: గవర్నర్
పుదుచ్చేరిలోని రాజ్ నివస్ నుంచి గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆయిల్ కంపెనీల ప్రతినిధులను సత్కరించారు. ఆయిల్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉందని.. ఈ కేటగిరీలో దేశం స్వయం సంవృద్ధి సాధించే దిశగా ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు