తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్మికలోకానికి గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్​.. మేడే శుభాకాంక్షలు.. - May Day Wishes

May Day Wishes: మేడే సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్.. కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో రక్తం, చెమట ధారపోసే కార్మికుల శ్రమను గుర్తించి గౌరవించే రోజే మేడే అని వివరించారు.

Governor tamilisai and CM KCR convey May Day Wishes to labours
Governor tamilisai and CM KCR convey May Day Wishes to labours

By

Published : May 1, 2022, 5:05 AM IST

May Day Wishes: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్.. కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యం, సంపదతో కార్మికలోకం అంతా బాగుండాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ గవర్నర్​ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో రక్తం, చెమట ధారపోసే కార్మికుల శ్రమను గుర్తించి గౌరవించే రోజే మేడే అని తమిళిసై అన్నారు. కార్మికుల కృషిని గౌరవిద్దామని, వారి శ్రమకు వందనం చేద్దామని పిలుపునిచ్చారు. పని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం ద్వారా మరింత ఉత్పాదకత సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్న ఆయన... కార్మికుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి, సేవారంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటూ విజయవంతంగా అమలవుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టి జరుగుతోందని... అది దేశాభివృద్ధికి దోహదపడుతోందని తెలిపారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details