తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఇంట్లో ఏ చిన్న చోటున్నా.. మొక్కలు పెంచండి'

హైదరాబాద్ నెక్లెస్​రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన 9వ జాతీయ ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శనను గవర్నర్​ తమిళిసై సందర్శించారు. వివిధ రకాల మొక్కలు పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ రూఫ్ గార్డెన్​కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

governor tamili sai visited nursery in neckless road
governor tamili sai visited nursery in neckless road

By

Published : Feb 1, 2021, 10:08 PM IST

ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఏ చిన్న చోటు ఉన్నా కూరగాయలు, పూల మొక్కలు పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నెక్లెస్​రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన 9వ జాతీయ ఉద్యానవన, వ్యవసాయ ప్రదర్శనను గవర్నర్​ సందర్శించారు. వివిధ రకాల మొక్కలు పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

పూలు, పండ్ల తోటలంటే తనకు చాలా ఇష్టమని.. ప్రదర్శన చాలా బాగుందని కితాబిచ్చారు. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించి ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ రూఫ్ గార్డెన్​కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఐదు రోజులుగా జరుగుతున్న నర్సరీ మేళ నేటితో ముగిసింది.

ఇదీ చూడండి: కనకరాజు బృందంతో గవర్నర్, సత్యవతి గుస్సాడీ నృత్యం

ABOUT THE AUTHOR

...view details