తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రాన్ని అమ్మలా కాపాడుకుంటా: గవర్నర్​ తమిళిసై - governor tamili sai about motherhood

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని లీ మెడిరియన్‌ హోటల్‌, కిమ్స్‌ కడిల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మిసెస్‌ మామ్‌-2020 ఫ్యాషన్‌ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గర్భిణీలు చేనేత వస్త్రాలు ధరించి చుడముచ్చటైన ర్యాంప్ వాక్ చేసి చూపరులను ఆకట్టుకున్నారు.

governor tamili sai participated in moms contest
governor tamili sai participated in moms contest

By

Published : Dec 21, 2020, 4:43 AM IST

రాష్ట్రాన్ని అమ్మలా కాపాడుకుంటా: గవర్నర్​ తమిళిసై

మాతృత్వం అనేది ప్రతీ మహిళకు ఒక మధురానుభూతి ఇస్తుందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌ తెలిపారు. తల్లి కాబోతున్న మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపోందించి... వారిని ఉల్లాసంగా ఉంచేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని లీ మెడిరియన్‌ హోటల్‌, కిమ్స్‌ కడిల్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మిసెస్‌ మామ్‌-2020 ఫ్యాషన్‌ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు చేనేత వస్త్రాలు ధరించి చుడముచ్చటైన ర్యాంప్ వాక్ చేసి చూపరులను ఆకట్టుకున్నారు.

ఈ ర్యాంప్ వాక్​లో సైబరాబాద్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని పాల్గొన్నారు. మొత్తం నలబై మంది గర్భిణీలు పాలుపంచుకున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాధారణ కాన్పులను ప్రోత్సహించేందుకు మిసెస్‌ మామ్‌ వంటి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక బిడ్డ లాంటిందని... వైద్యురాలైన తాను అమ్మలా కాపాడుకుంటానని తమిళిసై వ్యాఖ్యానించారు. గర్భిణీలు.... యోగా మెడిటేషన్‌ వంటివి చేయడం వలన ఒత్తిడి తగ్గి సుఖ కాన్పు అవుతారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కిమ్స్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ధరణి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.106 కోట్ల ఆదాయం

ABOUT THE AUTHOR

...view details