పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు విమాన సేవలందిస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ చొరవతో పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. తమిళిసై ఇవాళ పుదుచ్చేరి నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు: గవర్నర్ - తెలంగాణ తాజా వార్తలు
పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హర్షం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సర్వీసులు అందరూ వినియోగించుకోవాలని కోరారు.

governor tamilasai
హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తారని గవర్నర్ అన్నారు. విమాన సర్వీసుల ప్రారంభంతో వ్యాపార అనుసంధానం పెరుగుతుందన్నారు. ఈ విమాన సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు.
ఇదీచూడండి:రేపే యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణం... యాగ జలాలతో పర్వానికి శ్రీకారం