రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్ తమిళిసై. ఆదివారం ఒక్కరోజే 199 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఇద్దరు వైద్య విద్యార్థులు, పోలీసులు కొవిడ్ బారిన పడటం ఆందోళన కలిగించే విషయమన్నారు. కరోనాపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పెరుగుతున్న కరోనా కేసులపై గవర్నర్ ఆందోళన - tamilisai on corona
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ సడలించిన వేళ.. ప్రజలు జాగ్రత్తలు మరవొద్దని సూచించారు. మరింత అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు.
Governor
అయితే ఈ విషయంలో ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని జగ్రత్తలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని గవర్నర్ సూచించారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు వైరస్‌కు వర్తించదని సూచించిన గవర్నర్... ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలను విడవొద్దని ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు.