గవర్నర్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సతీసమేతంగా బిహార్‌లోని గయా పర్యటనలో ఉండగా అకస్మాత్తుగా వాంతులతో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆయనను సమీపంలోని మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ముందుజాగ్రత్తగా రక్తపరీక్షలు, ఈసీజీ నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఎలాంటి సమస్య కనిపించలేదు. గయా వైద్యులు హైదరాబాద్‌లో ఉన్న గవర్నర్ వ్యక్తిగత వైద్యుడు సుభాష్‌తో కూడా మాట్లాడారు. ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధరించుకున్నాక.. గవర్నర్ తిరిగి దిల్లీ వెళ్లిపోయారు. అక్కడి నుంచి హైదరాబాద్ రానున్నారు.
గవర్నర్ నరసింహన్‌కు స్వల్ప అస్వస్థత - Governor Narasimhan indisposition in bhihar
గవర్నర్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బిహార్‌లోని గయా పర్యటనలో ఉండగా.. ఆయన అస్వస్థతకు గురవడం వల్ల ఆసుపత్రి వెళ్లి చికిత్స పొందారు.

Governor Narasimhan
నిన్న గవర్నర్ సతీసమేతంగా బిహార్ వెళ్లారు. గయాలో మహాబోధి మందిర్‌ను దర్శించుకున్నారు.
గవర్నర్ నరసింహన్‌కు స్వల్ప అస్వస్థత
Last Updated : Aug 19, 2019, 3:27 PM IST