తెలంగాణ

telangana

ETV Bharat / city

సంప్రదాయాలే మనకు రక్ష: గవర్నర్​ - సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని గవర్నర్‌ డా. తమిళిసై

భారత్‌ పాటిస్తున్న సంప్రదాయాలే మనకు రక్షణగా నిలుస్తున్నాయని గవర్నర్‌ డా. తమిళిసై సౌందర్‌రాజన్‌ అభిప్రాయపడ్డారు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని గవర్నర్‌ సందర్శించారు. వైరస్​ నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యుల సేవలను కొనియాడారు. మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన బృందానికి అభినందనలు తెలిపారు.

governor tamili sai felicitate esi hospital doctor
సంప్రదాయాలే మనకు రక్ష: గవర్నర్​

By

Published : May 11, 2020, 10:42 AM IST

Updated : May 11, 2020, 11:07 AM IST

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని గవర్నర్‌ డా.తమిళిసై సందర్శించారు. కరోనాను భారత్‌ చాలా సమర్థంగా ఎదుర్కొంటోందని కితాబిచ్చారు. వైరస్​ నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యుల సేవలను కొనియాడారు.

ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో వైద్యులు విధులు నిర్వహించడం గర్వకారణమన్నారు. రోగుల ప్రాణాలు కాపాడటమే వైద్యుల ప్రధాన ఆశయమని గుర్తు చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. అందరి నుంచి వందనం అందుకునే జవాన్లు కూడా వైద్యులకు సెల్యూట్‌ చేశారని పేర్కొన్నారు.

సాధారణ రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలిని గవర్నర్​ విజ్ఞప్తి చేశారు. మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన బృందానికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు పాటిస్తున్న శుభ్రత చర్యలు మన ఆచారంలో అనాదిగా ఉన్నాయని వివరించారు. భారత్‌ పాటిస్తున్న సంప్రదాయాలే మనకు రక్షణగా నిలుస్తున్నాయన్నారు.

సంప్రదాయాలే మనకు రక్ష: గవర్నర్​

ఇవీ చూడండి:వామ్మో సూపర్‌ స్ప్రెడర్స్‌... వారి వల్లే 300 మందికి కరోనా.

Last Updated : May 11, 2020, 11:07 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details