తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆమెకు ఫోన్​ చేసి అభినందించిన హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ - Bandaru Dattatreya

అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే పాక్‌ జలసంధిని తాజాగా తెలుగు మహిళ గోలి శ్యామల ఈది సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ఆమెకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్​ చేసి అభినందించారు. శ్యామల తన 47 ఏళ్ల వయసులో ఈ సాహసానికి పూనుకోవడం విశేషం.

governor bandaru dattatreya congratulated to goli shyamala
ఆమెకు ఫోన్​ చేసి అభినందించిన గవర్నర్​

By

Published : Mar 21, 2021, 8:23 PM IST

భారత్‌-శ్రీలంకల్ని కలిపే 30 కిలోమీటర్ల నీటి వారధిని తెలుగు మహిళ గోలి శ్యామల కేవలం 13 గంటల్లోనే ఈదింది. ఈ సందర్భంగా ప్రపంచ రికార్డు సృష్టించిన రెండో మహిళగా ఆమె ఘనత సాధించింది. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆమెకు ఫోన్​ చేసి అభినందించారు. ఇది మహిళల విజయంగా తానూ భావిస్తున్నట్లు ఆమెను ప్రశంసించారు.

యానిమేషన్ చిత్రాల నిర్మాతగా, దర్శకురాలిగా, రచయితగా రాణిస్తున్న గోలి శ్యామల అనేక మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ఈ ఘనత వారి సాహసానికి పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమెకు మరెన్నో కీర్తి ప్రతిష్టలు లభించాలని దత్తాత్రేయ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇదీ చూడండి :ఫిట్‌నెస్‌ కోసం ఈత.. ఇప్పుడు ప్రపంచ రికార్డు

ABOUT THE AUTHOR

...view details