కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీ ఒక్కరు తమవంతుగా ఏదో ఒకటి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కళాకారులు, వివిధ కళారూపాలతో ప్రజలను జాగృతం చేస్తున్నారు. తాజాగా పులి దేవెందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పాటలతో సమాజాన్ని మేల్కొల్పుతూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన దేవెందర్ కరోనాపై స్వయంగా మూడు గేయాలు రాసి, ఆలపించారు. 'పదరా... పద పదరా కనపడని శత్రువుతో యుద్ధం... కదరా' అంటూ స్వయంగా రాసి పాడిన పాటను యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన వస్తున్నది. ఉద్యోగ రీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ... ప్రవృత్తిపరంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతుంటాడు.
కరోనాపై.. ఉపాధ్యాయుడి పాట! - undefined
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. కొందరు పాటలు, కళల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పులి దేవెందర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన వంతుగా పాట రూపొందించి.. పాడాడు.
![కరోనాపై.. ఉపాధ్యాయుడి పాట! Government Teacher Writes A Song On corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6854001-691-6854001-1587294329904.jpg)
కరోనాపై.. ఉపాధ్యాయుడి పాట!