గొల్ల కురమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. నల్గొండలోని బత్తాయి మార్కెట్లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి... పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారులకు 5వేల యూనిట్లు పంపిణీ చేయనున్నట్టు ఇప్పటికే మంత్రి ప్రకటించారు.
ఇవాళ రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం - నల్గొండలో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సర్కార్ ఇవాళ ప్రారంభించనుంది. నల్గొండలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు అందించనున్నారు.

ఇవాళ రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం
ఈ విడతలో రూ.360 కోట్లతో ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయనుంది. మొదటి విడతలో 76.66 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యంగా నిర్ధేశించుకొని... ఏ-ఫేజ్లో 3.67లక్షలు, బీ-ఫేజ్లో 3.64లక్షల మందికి పంపిణీ చేసినట్టు మంత్రి వివరించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:11 రాష్ట్రాలకు విస్తరించిన 'బర్డ్ ఫ్లూ'