కరోనా మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారికి ఉద్యోగం కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి - AP
కరోనా మృతుల కుటుంబాల్లో అర్హూలైన వారికి ఉద్యోగం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన ఉద్యోగి పోస్టుకు సమాన, తక్కువస్థాయి పోస్టు ఇవ్వాలని... కలెక్టర్లకు ఆదేశించింది.
కరోనా మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి
మరణించిన ఉద్యోగి పోస్టుకు సమాన, తక్కువస్థాయి పోస్టు ఇవ్వాలని... గతేడాది నవంబరు 31లోగా మరణించిన వారి కుటుంబాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. కొందరిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించాలని కలెక్టర్లకు ఆదేశించింది. దీనికి సంబంధించి పెద్దమొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరగా పరిశీలించి నియామకం చేపట్టాలని సంబంధింత అధికారులను ఆదేశించింది.
TAGGED:
AP