రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి - తెలంగాణలో బార్లు ప్రారంభం
17:21 September 25
రాష్ట్రంలో బార్లు, క్లబ్బులు తెరిచేందుకు ప్రభుత్వ అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం బార్లు, క్లబ్‌లు, పర్యాటక బార్లు తెరచుకోడానికి అనుమతించింది. తక్షణమే తెరచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. కొవిడ్ దృష్ట్యా మార్చి చివర వారంలో మూతపడిన బార్లు, క్లబ్‌లు, పర్యాటక బార్లు ఆరు నెలల తరువాత తిరిగి తెరచుకోడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ గదులు మాత్రం తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తెరవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేసింది.
కొవిడ్ నియమనిబంధనలను పాటిస్తూ బార్లు, క్లబ్‌లు, పర్యాటక బార్లు నిర్వహించాలని వెల్లడించారు. ప్రతి ఒక్కరిని ప్రవేశ ద్వారం వద్దనే థర్మామీటర్‌తో ఉష్ణ్రోగ్రతలు పరీక్షించాలని, క్యూ విధానం అమలు చేయాలని, పార్కింగ్ ప్రదేశాల్లో రద్దీ లేకుండా చూడాలని, శానిటైజర్ ఏర్పాటు చేయాలని, బార్ సిబ్బందితో సహా మాస్కులు ధరించేట్లు చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మ్యూజికల్ ఈవింట్లను, డ్యాన్స్‌లను నిషేధించినట్లు వెల్లడించింది.
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సార్లు బార్లు, క్లబ్ ప్రాంగణం మొత్తం శానిటైజ్ చేయాలని, కస్టమర్ మారిన ప్రతి సారి... వారు కూర్చున్న సీటును శానిటైజ్ చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.