AP GOVT INVITE EMPLOYEE UNIONS : పీఆర్సీ పై చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. పీఆర్సీ సమస్యలపై మంత్రుల కమిటీతో చర్చించాలని.. ఉద్యోగ సంఘాలకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ సమాచారం పంపారు. సచివాలయంలోని రెండో బ్లాక్ ఆర్థికశాఖ కాన్ఫరెన్స్ హాల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు చర్చించేందుకు మంత్రులు సిద్ధంగా ఉంటారని తెలిపారు.
AP PRC Issue: పీఆర్సీపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం - AP PRC Issue
AP PRC Issue : పీఆర్సీపై చర్చకు రావాలంటూ ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది.
![AP PRC Issue: పీఆర్సీపై చర్చించడానికి ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం AP PRC Issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14275094-387-14275094-1643084615462.jpg)
AP PRC Issue
AP PRC Issue : పీఆర్సీ సమస్యలపై సమ్మెకు వెళ్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని ఏపీ పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. తమ డిమాండ్లు పరిగణనలోకి తీసుకోకుండా జీవోలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల్లో భాగంగా తమ సమస్యలు ఆలకించామని ప్రభుత్వం చెబుతోందని.. కాని పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. తమనే కాదు.. పౌరసమాజాన్ని కూడా సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
- ఇదీ చదవండి :AP Employees Strike: 'ఇదేదో ఆషామాషీ ఉద్యమం కాదు'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!