అనుమతులు లేని లేఅవుట్లకు సంబంధించిన ప్లాట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన పక్షం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2020లో ప్రకటించిన ఎల్ఆర్ఎస్లో భాగంగా దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వివిధ కారణాల రీత్యా వాటి పరిశీలన జరగలేదు. దీంతో నిర్దేశిత గడువులోగా దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు దశల్లో పరిశీలన చేయాలన్న ప్రభుత్వం... మొదటి దశలో దరఖాస్తులన్నింటినీ గ్రామాలు, వార్డులు, సర్వే నంబర్లు, కాలనీల వారీగా క్లస్టర్లుగా విభజించాలని తెలిపింది.
LRS: ఎల్ఆర్ఎస్ లేఅవుట్ల పరిశీలనకు ప్రభుత్వం మార్గదర్శకాలు - telangana varthalu
ఎల్ఆర్ఎస్లో భాగంగా ప్లాట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన పక్షం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రక్రియ మొత్తాన్ని పక్షం రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని... ఆ తర్వాత తదుపరి మార్గదర్శకాలు జారీ అవుతాయని తెలిపింది.
రెండో దశలో అధికారుల బృందం క్లస్టర్లను తనిఖీ చేసి రిమార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకోసం రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో జిల్లా కలెక్టర్లు అధికారుల బృందాలను నియమించాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో.. సంబంధిత మున్సిపల్ కమిషనర్ లేదా కలెక్టర్లకు నివేదించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని పక్షం రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని... ఆ తర్వాత తదుపరి మార్గదర్శకాలు జారీ అవుతాయని తెలిపింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: LAND VALUE: భూములు, ఆస్తుల మార్కెట్ విలువల పెంపు.. రేపటి నుంచి అమలు