రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ మత్స్య రంగానికి పెద్దపీట వేస్తున్న సర్కారు.. ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలు పంపిణీ సాగిస్తోంది. 2020-21 సంవత్సరం సంబంధించి సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం(ఐఎఫ్‌డీఎస్) అమలులో భాగంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అందుకోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) కింద 100 శాతం రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లలు అనువైన జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో వదిలిన విషయం విదితమే.
ఎన్‌సీడీసీ నుంచి రుణం మంజూరీ కోసం ప్రభుత్వం గ్యారెంటీ - తెలంగాణ తాజా వార్తలు
మత్స్య విత్తనం కొనుగోళ్లు సంబంధించి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి రూ.60 కోట్ల రుణం మంజూరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
ఈ క్రమంలో మత్స్య విత్తనం కొనుగోళ్లు సంబంధించి ఎన్‌సీడీసీ నుంచి రూ.60 కోట్ల రుణం మంజూరీ కోసం ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. తాజాగా పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి లక్ష్యంగా ఈ ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు పొడగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం మేరకు 2 శాతం కమీషన్‌పై ఏకీకృతం చేసి ఈ పథకం విజయవంతంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి:ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. పసివాడికి పోషణ