తెలంగాణ

telangana

ETV Bharat / city

2,910 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్ - గ్రూప్ 2 నోటిఫికేషన్

telangana govt
telangana govt

By

Published : Aug 30, 2022, 8:56 PM IST

Updated : Aug 30, 2022, 9:28 PM IST

20:53 August 30

663 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి అనుమతి

రాష్ట్రంలో మరో 2910 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి అనుమతించింది. అలాగే, పశుసంవర్థక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా అనుమతితో ఉద్యోగాల నియామక ప్రక్రియలో యాభై వేల మైలురాయిని అధిగమించినట్లు ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గడచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్న హరీష్ రావు... ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రూప్​-2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్ఓ పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపీఓ పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 ఉన్నాయి. 38 చేనేత ఏడీఓ పోస్టులు, 25 ఆర్థికశాఖ ఏఎస్ఓ పోస్టులు, 15 అసెంబ్లీ ఏఎస్ఓ పోస్టులు, 14 గ్రేడ్ టూ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 11 గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు, తొమ్మిది ఏఎల్ఓ, ఆరు న్యాయశాఖ ఏఎస్ఓ పోస్టులు ఉన్నాయి.

గ్రూప్-3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు, కేటగిరీల పరిధిలో 1373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులున్నాయి. వ్యవసాయశాఖలో 199 గ్రేడ్-2 ఏఈఓ పోస్టులు, 148 ఏఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉద్యానవన శాఖలో 21 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. సహకారశాఖలో 63 అసిస్టెంట్ రిజిస్ట్రార్, 36 జూనియర్ ఇన్ స్పెక్టర్ పోస్టులున్నాయి. పశుసంవర్ధకశాఖలో 183 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 99 వెటర్నరీ అసిస్టెంట్ సహా 294 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. విత్తన ధృవీకరణ సంస్థలో 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారి, ఆరు ఆర్గానిక్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. మత్య్సశాఖలో తొమ్మిది ఎఫ్​డీఓ, నాలుగు ఏడీ, రెండు అసిస్టెంట్ ఇన్​స్పెక్టర్ పోస్టులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుల పరిధిలో 12 పోస్టులు, ఇంధనశాఖలో 11 సహాయ ఎలక్ట్రికల్ పోస్టులు, గిడ్డంగుల సంస్థలో 28 ఏడబ్ల్యూఎం, 14 మేనేజర్ సహా 50 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 30, 2022, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details