తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలోనే కొలిక్కి రానున్న ప్రభుత్యోద్యోగుల పీఆర్సీ అంశం... - telangana prc 2020

ప్రభుత్వ ఉద్యోగుల వేతనసవరణ అంశం త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేతనసవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​... సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కమిషన్ నుంచి నివేదిక రాగానే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమై పీఆర్​సీని ఖరారు చేస్తారని అంటున్నారు.

government employees prc in Telangana updates
government employees prc in Telangana updates

By

Published : Dec 15, 2020, 4:24 AM IST

త్వరలోనే కొలిక్కి రానున్న ప్రభుత్యోద్యోగుల పీఆర్సీ అంశం...

వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వేతన సవరణ ప్రకటించిన కేసీఆర్​ సర్కారు... 2018 మే నెలలో తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘాన్ని నియమించింది. సాధారణంగా ఒక్కరితోనే కమిషన్ నియమిస్తుంటారు. కానీ... త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్​... ముగ్గురితో కమిషన్‌ను నియమించారు. విశ్రాంత ఐఏఎస్​ అధికారుల్లో సీఆర్​ బిస్వాల్ ఛైర్మన్‌గా... రఫత్ అలీ, ఉమామహేశ్వర రావులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వేతన సవరణతో పాటు వివిధ ఇతర అంశాలను కూడా కమిషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఆ మేరకు విధివిధానాలు ప్రకటించింది.

పీఆర్సీ సహా ఉద్యోగుల సంబంధిత అంశాలు, సమస్యలపై కమిషన్‌ ఉద్యోగ సంఘాలతో పాటు వ్యక్తిగతంగానూ అభిప్రాయాలు సేకరించింది. కమిషన్‌ పదవీకాలం గతంలోనే పూర్తైనప్పటికీ... ప్రభుత్వం పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. ప్రస్తుతం కమిషన్‌ గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వేతనసవరణ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఆర్సీ కసరత్తును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి... అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆర్థికశాఖ అధికారులు కసర్తతు చేస్తున్నట్లు తెలిసింది.

ఇప్పటికే మంజూరు చేసిన డీఏలను పరిగణలోకి తీసుకొని ఫిట్‌మెంట్‌ శాతాన్ని ఖరారు చేయనున్నారు. ఎంత శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఖజానాపై ఎంత వరకు భారం పడుతుందన్న విషయంపై ఆర్థికశాఖ అధికారులు లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. నెలాఖరుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అటు కమిషన్ కూడా ఆలోగానే నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. అందుకు అనుగుణంగానే సంకేతాలు ఉన్నాయని చెప్తున్నారు.

కమిషన్ నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి తమతో సమావేశం అవుతారని ఉద్యోగసంఘాలు చెప్తున్నాయి. పీఆర్సీ కమిషన్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా వేతన సవరణను ఖరారు చేస్తారని... ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.

ఇదీ చూడండి: యుద్ధ ప్రాతిపదికన టీ-ఫైబర్ ప్రాజెక్టు

ABOUT THE AUTHOR

...view details